చర్చ : కరీంనగర్ జిల్లా…

చర్చ : కరీంనగర్లో బంద్ లో భాగంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు సాధనకు బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ లో భాగంగా శనివారం ఉదయం కరీంనగర్లో పలుచోట్ల జరిగిన నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్, ప్రకాశం గంజుతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని రాజేందర్ రావు ఆరోపించారు.