చర్చ : కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
బీసీ బంద్ – ఆగిపోయిన బస్సులు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో…..
బీసీ బంద్ – ఆగిపోయిన బస్సులు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బంద్ పిలుపు నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్లో ఉదయం నుంచే అధికారులు సర్వీసులను నిలిపివేశారు. మొత్తం 61 బస్సు సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రజలు బయట వాహనాలను ఆశ్రయించడంతో అధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఉదయం నుంచే పట్టణ రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వామపక్ష నాయకులు ఉదయం నుండే ఆర్టీసీ ప్రాంగణంలో నినాదాలు చేస్తూ బీసీ రిజర్వేషన్ కు మద్దతునిస్తూ బందులో పాల్గొన్నారు..