చర్చ : ఖమ్మం జిల్లా , సత్తుపల్లి లో మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు కోనేరు నాని గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర…
సత్తుపల్లి లో కోనేరు నాని గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర...


చర్చ : ఖమ్మం జిల్లా , సత్తుపల్లి లో మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు కోనేరు నాని గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర…
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు చెందిన బిఆర్ఎస్ నాయకులు కోనేరు నాని ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా ఆదివారం నాడు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, టౌన్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, టౌన్ ప్రధాన కార్యదర్శి మల్లూరు అంకంరాజు, అమరవరపు కృష్ణారావు, చాంద్ పాషా, రాజలక్ష్మి, ఖాసిం, నరుకుళ్ల శ్రీను, గాదె సురేష్, జొన్నలగడ్డ కృష్ణ, కోట రాజకుమార్ తదితరులున్నారు.