News & Views

చర్చ : భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

భద్రాచలంలో బీసీ సంఘాలకు మద్దతు తెలిపి బందులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ...

చర్చ : భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో..

భద్రాచలంలో బీసీ సంఘాలకు మద్దతు తెలిపి బందులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ…

ఈ సందర్భంగా మానే రామకృష్ణ మాట్లాడుతూ బీసీ నాకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ హామీ ఇచ్చిందని
కానీ నేడు అమలు గాని జీవోలతో బీసీలను రాజకీయంగా వాడుకుంటుందని.. అసెంబ్లీలో ఉన్న బారాస శాసనసభ్యులు శాసన మండల సభ్యులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారని.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా బీసీల విషయంలో మోసం చేస్తుందని కాంగ్రెస్ బిజెపిల వైఖరిని తెలంగాణ బీసీ సమాజం గమనిస్తుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, మండల పార్టీ సీనియర్ నాయకులు ప్రజాసంఘాల బాధ్యులు అనుబంద విభాగాల నాయకులు మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు