


చర్చ : సత్తుపల్లి,ఖమ్మం జిల్లా… బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్.
సత్తుపల్లి: తెలంగాణ బీసీ సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన బీసీ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ ఘన మద్దతు తెలిపింది. సత్తుపల్లి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీసీ హక్కుల కోసం బంద్ కు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కూసంపూడి మహేష్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయసమ్మతమని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం తెలంగాణ అభ్యున్నతికి ముఖ్యమైన అడుగు అవుతుందని తెలిపారు. బీసీ వర్గాలు నిలదొక్కుకోవాలంటే రిజర్వేషన్లు తప్పనిసరి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్ పై స్పందించాలని కోరారు. బీసీ వర్గాల సమగ్రమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ సమాజం హక్కుల సాధనలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు.