బీసీ బంద్ కు నా పూర్తి మద్దతు!
కాంగ్రెస్ పార్టీ ఓ బి సి మండల అధ్యక్షులు గోపు రామకృష్ణ(ఆర్కే)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, అక్టోబర్ 17(చర్చ):
టి పి సి సి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కొరకు 18వ తారీకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేయబోయే తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బిసి జన గణన చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్య ,ఉద్యోగాలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని తప్పుపడుతూ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్న కొన్ని అతీత శక్తుల చర్యలకు నిరసనగా బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది కావున మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బీసీ సంఘాల బంద్ ను విజయవంతం చేయాలి అని జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ ఓబిసి మండల అధ్యక్షులు గోపు రామకృష్ణ(ఆర్కే) పిలుపునిచ్చారు.