చర్చ,, జగిత్యాల: టి. ఆర్ నగర్లో గంటపాటు కరెంట్ బంద్

టి. ఆర్ నగర్లో గంటపాటు కరెంట్ బంద్
చర్చ,, జగిత్యాల ప్రతినిధి : ఓ విద్యుత్ కాంట్రాక్టర్ చేపట్టిన పని సకాలంలో పూర్తికాకపోవడంతో షెడ్యూల్ లేకుండానే ఓ గంట పైగా కరెంట్ కట్ ఫెవర్ చేసిన సంఘటన బుధవారం టి. ఆర్.నగర్ లో చోటుచేసుకొంది. జగిత్యాల అర్బన్ మండలం టి. ఆర్. నగర్ లో ఓ సబ్ స్టేషన్ ఉంది. దీని క్రింద దాదాపు గా ఏడుకు పైగా ఫిడర్లు ఉంటాయాన్నట్లు సమాచారం. విద్యుత్ శాఖ అధికారులు వినియోగదారుల అవసరాలకై చేపట్టే సదుపాయాల కోసం ముందుగానే కరెంట్ తీసివేసే సమయాన్ని సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రచారం చేయడం పరిపాటి. దీనికి భిన్నముగా బుధవారం టి. ఆర్ నగర్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు ఓ కాంట్రాక్టర్ కోసం గంట పాటు అనదికారంగా కరెంట్ కట్ చేసినట్లు స్థానికులు అంటున్నారు. కరెంట్ కటింగ్ షెడ్యూల్ ను స్థానిక విద్యుత్ ఉన్నతాకారులతోపాటు ఆపై స్థాయి విద్యుత్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నట్లు తెలిసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ కట్ చేయడంతో ఎంతో మంది ధీర్ఘ కాల వ్యాధిగ్రస్తులు, రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు స్థానికులు అంటున్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా వుండాలంటే సంబంధిత అధికారులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని టి. ఆర్. నగర్ వాసులు కోరుతున్నారు