News & Views

చర్చ, కరీంనగర్ :12 వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు

కరీంనగర్ పట్టణంలోని డా,, బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో మా అసోసియేషన్ 12 వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అథ్లెటిక్స్ గౌరవ అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి, శ్రీధర్, మర్రి లక్షారెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్యజీవితంలో రాజకీయంగా ఎంత ఇబ్బంది ఉన్న ఆరోగ్యపరంగా, శారీరకంగా ఉండే మర్రి లక్ష్మారెడ్డిని రోల్ మోడల్ గా తీసుకుంటామని అన్నారు.

ఎక్కడ మ్యాచ్ ఉన్నా నిర్వహణకు ప్రభుత్వంలో ఉన్నవారు మద్దతిస్తారని క్రీడాకారులకు తెలిపారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, చిత్తశుద్ధితో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. అందరికీ శారీరక శ్రమ తక్కువై ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుందని, అందరూ ఉదయం లేవగానే వాకింగ్ ట్రాక్స్ కి వచ్చి ఉదయం నడక ద్వారా శారీరక ఫిట్నెస్ ఉంచుకోవాలని సూచించారు.
మన ముఖ్యమంత్రి క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి ఒలంపిక్స్ లో రాష్ట్రం నుండి మెడల్ తెచ్చేలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక జాతీయ స్థాయి క్రీడలు హైదరాబాద్ లో ఇతర జిల్లాల్లో జరుగుతున్నాయని అన్నారు. భవిషత్ లో అథ్లెటిక్స్ మాత్రమే కాదు, ప్రతి ఆటలో ఒలంపిక్స్ లో రాష్ట్రం నుండి క్రీడాకారులు ప్రాతినిద్యం వహించాలని సూచించారు.