చర్చ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్,ఆర్ఆర్ చికెన్ సెంటర్ వద్ద నిలిచిపోయిన హైవే కాలువను గోధుమ వాగు వరకు కొనసాగిస్తా- శ్రీరాముల విశ్వనాథ్…
ఆర్ఆర్ చికెన్ సెంటర్ వద్ద నిలిచిపోయిన హైవే కాలువను గోధుమ వాగు వరకు కొనసాగిస్తా- శ్రీరాముల విశ్వనాథ్.
– హైవే కాలువ కొనసాగింపుకు హామీ ఇచ్చిన ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి
– స్వార్థంతో ప్రజాధనాన్ని వృధా చేసిన గత పాలకులు
– హైవే కాలువను మళ్ళించడంతో ముంపు ప్రాంతాలుగా మారిన పంచాయతీలు
చర్చ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్:
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 14వ డివిజన్‌లో సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీరాముల విశ్వనాథ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్ఆర్ చికెన్ సెంటర్ వద్ద నిలిచిపోయిన హైవే కాలువను గోధుమ వాగుకు కలపడం ద్వారా ఏళ్లుగా కొనసాగుతున్న వర్షపు నీటి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
గత పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం హైవే కాలువను లోతట్టు పంచాయతీల వైపు మళ్లించడంతో ప్రజాధనం వృథా కావడమే కాకుండా పలు గ్రామాలు ముంపు ప్రాంతాలుగా మారాయని విమర్శించారు. హైవే కాలువ నిర్మాణాలను పూర్తి చేసి వరద నీటిని గోధుమ వాగులోకి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాల పనులు సకాలంలో పూర్తి చేస్తానని, సమస్యలకు శాశ్వత పరిష్కారాలే నిజమైన అభివృద్ధి అని విశ్వనాథ్ స్పష్టం చేశారు. సింగరేణి సీఆర్పీ క్యాంపులో ఇండ్లు లేని అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడం, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు అందించడం తన ప్రాధాన్యతలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తూ పేద–ధనిక తేడా లేకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. విశ్వనాథ్ ప్రణాళికలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఆయనను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.