చర్చ,పెద్దపల్లి: ఇసుక ట్రాక్టర్ల పట్టివేత…15 ట్రాక్టర్లు పట్టుకున్న రెవిన్యూ అదికారులు….
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా....

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత…
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా….
15 ట్రాక్టర్లు పట్టుకున్న రెవిన్యూ అదికారులు….
చర్చ,పెద్దపల్లి:
సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగు నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న15 ట్రాక్టర్లను రెవిన్యూ అధికారుల పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా అర్థరాత్రి నుండి ఉదయం వరకు ఈ అక్రమ ఇసుక దందగా కొనసాగుతోంది. అక్రమంగా డంపులు ఏర్పాటు చేస్తూ అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు రెవెన్యూ అదికారులకు సమాచారం అందడంతో శనివారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్ల ను పట్టుకొని సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్ .ఐ వినోద్ తెలిపారు.