News & Views

చర్చ,కొత్తగూడెం: వందేమాతర గీతానికి 150 ఏళ్లు

 

వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా…
– హెచ్ఎం రూబి కి మొక్కను అందజేసిన విద్యార్థిని నైనికరజువా

చర్చ,కొత్తగూడెం:

వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా కొత్తగూడెం సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వందేమాతర గీతాలాపన అనంతరం 6వ తరగతి విద్యార్థిని, ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల హెచ్ఎం రూబి కి జెడ్‌ ప్లాంట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం రూబి మాట్లాడుతూ ‘‘నైనిక రజువా చిన్న వయసులోనే ప్రకృతిహిత దృక్పథంతో మొక్కలు నాటడం, వాటిని ఇతరులకు బహుమతిగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ చైతన్యం ప్రతి విద్యార్థిలో పెరగాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటావు, ఎన్ని పంపిణీ చేశావని నైనికను హెచ్ఎం రుబీ అడిగి తెలుసుకున్నారు.