News & Views

చర్చ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, 15వ డివిజన్‌లో గెలుపు డిసైడ్? – వార్ వన్ సైడ్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని…

15వ డివిజన్‌లో గెలుపు డిసైడ్?

– వార్ వన్ సైడ్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని
– ప్రచారంలో సుప్రియకు సక్సెస్ వైబ్
– మద్దతుగా రుద్రంపూర్ సక్సెస్ సర్పంచ్ కేస్లీ
– పొంగులేటి రాకతో మారిన రాజకీయ సమీకరణాలు

చర్చ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ :

భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 15వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సిపిఎం మద్దతుతో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థిని ఆకునూరి సుప్రియకు ఆఖరి రోజు ప్రచారంలో ఓటర్ల నుంచి సానుకూల స్పందన లభించింది.
పొంగులేటి రాకతో డివిజన్‌లో రాజకీయ సమీకరణాలు మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి స్థలాలు, ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ కార్డుల అంశాలపై పొంగులేటి ఇచ్చిన హామీలకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

‘హస్తం సహాయం లేనిదే అభివృద్ధి సాధ్యం కాదు’ అనే నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో జోష్ పెంచగా, ప్రజలను ఆదుకునే అభయ హస్తంగా కాంగ్రెస్‌ను ఓటర్లు చూస్తున్నారని రుద్రంపూర్ సర్పంచ్ కేస్లీ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో 15వ డివిజన్‌లో కాంగ్రెస్ విజయం సాధించి, ఆకునూరి సుప్రియ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.