చర్చ, జగిత్యాల :స్పెషల్ లోక్ అదాలత్ లో 1861 కేసుల్లో రాజీ

స్పెషల్ లోక్ అదాలత్ లో 1861 కేసుల్లో రాజీ
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చర్చ, జగిత్యాల : జగిత్యాల జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రాజీకి అవకాశం ఉన్న 1861 కేసుల్లో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ లో రాజీ కుదిరిందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం అయన మీడియా తో మాట్లాడారు. జగిత్యాల జిల్లా పరిధిలోని రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిశీలన చేసి ఇరువురు మధ్యలో రాజీకి ప్రయత్నం జరిగిందన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్ లో 1861 కేసుల్లో రాజీ కుదిరిందని తెలిపారు. ఇందులో 66 మంది భాదితులు సైబర్ క్రైం కేసుల్లో కోల్పోయిన 20 లక్షల ను తిరిగి అందజేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ సేఫ్టీ, బ్యాంకింగ్ కో ఆర్డినేషన్, టెక్నీకల్ ట్రాకింగ్, స్పాట్ ఫ్రీజింగ్ చర్యలతోనే ఈ రికవరీ సాధ్యమైందని ఎస్పీ అన్నారు. ఈ సందర్బంగా జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటి సర్వీసెస్, పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు