చర్చ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, 23 వ డివిజన్‌లో గెలుపు డిసైడ్? – వార్ వన్ సైడ్‌గా స్వతంత్ర అభ్యర్థిని…
23 వ డివిజన్‌లో గెలుపు డిసైడ్?
– వార్ వన్ సైడ్‌గా స్వతంత్ర అభ్యర్థిని
– ప్రచారంలో విజయలక్ష్మి రమేష్ బాబు కు సక్సెస్ వైబ్
చర్చ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ :
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 23 వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిని గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థిని గుగులోత్ విజయలక్ష్మి కి ఆఖరి రోజు ప్రచారంలో ఓటర్ల నుంచి సానుకూల స్పందన లభించింది.
23 వ డివిజన్‌లో రాజకీయ సమీకరణాలు మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ కార్డుల అంశాలపై విజయలక్ష్మి ఇచ్చిన హామీలకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
“ఉంగరం గుర్తుపై ఓటు వేయండి, అభివృద్ధికి పట్టం కట్టండి” అని ఓటర్ అభిమానులు ప్రచారంలో జోష్ పెంచగా, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యే అవకాశాలు గుగులోత్ విజయలక్ష్మి కి బలంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ రెబల్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.