News & Views

చర్చ,రామగుండం: ఘనంగా ఎన్టీపీసి ఆవిర్బావ వేడుకలు.

ఘనంగా ఎన్టీపీసి ఆవిర్బావ వేడుకలు

ఘనంగా ఎన్టీపీసి ఆవిర్బావ వేడుకలు….

చర్చ,రామగుండం:

దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ వెలుగు విరజిమ్మే రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ అడ్మిన్ బిల్డింగ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు.
ముందుగా సంస్థ జెండాను ఆవిష్కరించిన ఈడీ అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా సంస్థ లో పని చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు 48వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అధికారుల, ఉద్యోగుల సమిష్టి కృషితో దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా రూపాంతరం చెందుతుందని ఈడీ తెలిపారు. ఉత్పత్తి తో పాటు సామాజిక బాధ్యత కింద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్లపై మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నాట్లు పేర్కొన్నారు.
దేశానికి స్థిరమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పరిరక్షణకు సంస్థ కట్టుబడి ఉన్నామని  తెలిపారు.