News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: పార్కులో పాము కలకలం..

భయాందోళనలో స్థానికులు

 

పార్కులో పాము కలకలం..
– భయాందోళనలో స్థానికులు

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం పట్టణం రామవరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పార్కులో సోమవారం పాము కలకలం సృష్టించింది. పార్క్‌ కమ్‌ క్రీడా మైదానంలో ఆడుకునేందుకు, ఓపెన్‌ జిమ్‌లో కసరత్తులు చేసేందుకు వచ్చిన స్థానికులు పామును చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ పార్కు కమ్‌ క్రీడా మైదానం ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరైనా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇప్పటికే పలుమార్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో పార్కు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. పార్కులో స్థానికంగా ఉండే కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు ప్రతినిత్యం ఆడుకునేంధుకు పార్కుకు వస్తుంటారు. అంతేకాక కొందరు క్రీడాకారులు వివిధ క్రీడలను ప్రాక్టీస్‌ చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వృద్ధులు, మహిళలు వాకింగ్‌ చేస్తుంటారు. గతంలోనూ ఈ పార్కులో పాములు తిరుగుతుండటాన్ని గమనించి అధికారులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయినా కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం కన్పించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఆడుకునే సమయంలో పాముకాటుకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పార్కులో పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.