చర్చ:రామగిరి : ఏ ఎల్ పి లో 56వ భద్రతా పక్షోత్సవాలు
సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఈనెల 8 నుండి 20 వరకు నిర్వహిస్తున్న భద్రతా పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు నందు 56వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది జీఎం ఎన్విరాన్మెంట్ , కమిటీ కన్వీనర్ బి.సైదులు నేతృత్వంలో తనిఖీ బృంద సభ్యులు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులందరు భౌగోళికంగా, సాంకేతికపరంగా విభిన్నమైన పరిస్థితులలో పని చేస్తున్నారని, అలాగే రక్షణతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరైన దిశలో వెళ్తున్నామని, అందుకు అధికారులు సూపర్వైజర్స్, ఉద్యోగుగులందరు అభినందనీయలులని తెలిపారు. బి.సైదులు, జీఎం ఎన్విరాన్మెంట్ , కన్వీనర్ మాట్లాడుతూ రక్షణ అనేది అన్నివేళలా పాటించాలని , ప్రమాదాలన్నీ చాలా వరకు మానవ తప్పిదాల వల్లే జరుగుతాయని కావున గని లో పని చేసేటప్పుడు రక్షణ పట్ల ఎటువంటి నిర్లక్ష్యం పనికిరాదని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు ప్రదర్శించిన బాహుబలి లఘునాటిక చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం లో ఎస్వోటు జిఎం, ఇంచార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బండి సత్య నారాయణ, ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు జూపాక రాంచందర్ , కోట రవీందర్ రెడ్డి, గంగాధర్, శర్వన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ రఘురాం, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కె.శంకర్, తనిఖీ బృందం సభ్యులు పాలడుగు శ్రీనివాస్, దేశాయ్, మేనేజర్ పెంచలయ్య, సేఫ్టీ ఆఫీసర్ కమలాకర్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, పాల్గొన్నారు.