News & Views

చర్చ, సత్తుపల్లి: గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో అక్క, తమ్ముడు, అక్కడికక్కడే మృతి…

సత్తుపల్లి పట్టణ శివారులోని పెద్ద వంతెన బ్రిడ్జి పై కొడుకు కూతురుతో టూ వీలర్ పై వెళ్తున్న వ్యక్తి వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన అక్క,తమ్ముడు… తండ్రి పరిస్థితి విషమంగా ఉండటం తో ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. వివరాలకు ఆంధ్రప్రదేశ్ చింతలపూడి మండలం కండ్రిక గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి కూతురు తేజస్విని (21) కుమారుడు దేవేందర్ లతో బైక్ పై వెళుతుండగా సత్తుపల్లి పట్టణ శివారులోని పెద్ద వంతెన బ్రిడ్జిపై వెనక నుండి గుర్తుతెలియని లారీ ఢీకొట్టి కూతురు తలపై నుండి లారీ చక్రం వెళ్లడంతో తల పగిలి మెదడు బయటకు వచ్చింది కూతురు, కుమారుడు ప్రమాద స్థలంలో అక్కడికక్కడే మరణించగా తండ్రికి తీవ్ర గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.. యాక్సిడెంట్ జరగటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నారు.