News & Views

చర్చ, సత్తుపల్లి: భార్య మృతి భర్తపై కేసు నమోదు..

భార్య మృతి భర్తపై కేసు నమోదు..

భార్య మృతి భర్తపై కేసు నమోదు..

చర్చ, సత్తుపల్లి:

అదనపు కట్నం కోసం భర్త వేధింపుల వలన భార్య మృతి చెందడంతో భర్త పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి హరిత తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరములు ప్రకారం గురువారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో పెద్ద కోరుకొండి గ్రామానికి చెందిన బండి శ్రీనివాసరావు తన భార్య నాగమణిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆమె భర్త బండి శ్రీనివాసరావు, అత్త బండి తిరుపమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.