News & Views

చర్చ, నంద తండా: డిపాజిట్ ఓట్లు కూడా లేని ఫూట్ బాల్ కత్తెర పోటుకి పంక్చర్ అవుతుంది ఫూట్ బాల్

డిపాజిట్ ఓట్లు కూడా లేని ఫూట్ బాల్
కత్తెర పోటుకి పంక్చర్ అవుతుంది ఫూట్ బాల్

చుంచుపల్లి నందా తండా గ్రామపంచాయతీ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాలోత్ బలరాం పై బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మూడ్ జయరాం చేసిన ఆరోపణలను వనమా శ్రేణులు ఖండించాయి. తమ అభిమాన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఇళ్లకు తాళాలు వేసుకొని గ్రామ దేవతను దర్శించి ప్రచారం కొనసాగించారే తప్ప, డిపాజిట్ ఓట్లు కూడా లేని మూడ్ జయరాం కి భయపడి కాదని, అసత్య ప్రచారాలు చేయకూడదని, ఫూట్ బాల్ ఎంత బలంగా ఉన్నా, ఎంత వేగంగా దూసుకొచ్చిన కత్తెర పోటు పడితే పంక్చర్ కావాల్సిందేనని వనమా శ్రేణులు మండి పడ్డారు. ఒకే పార్టీకి చెందిన వ్యక్తి విజయాన్ని కాంక్షించాలి కానీ ఈర్ష పడకూడదని, వ్యక్తిగత గెలుపులా కాకుండా పార్టీ గెలుపుగా భావించాలని, పార్టీకి విజయాన్ని అందించాలని కోరారు.