News & Views

చర్చ, రామగిరి:నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

రామగిరి మండలంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల ను బుధవారం సెంటినరీ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయం ఐఎన్టియుసి ఆర్జీ 3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కు సేవ చేస్తూ మన్ననలు పొందాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరారు. సన్మాన గ్రహీతలు పన్నూరు సర్పంచ్ చిందం మహేష్, కావేటి మల్లీశ్వరి ఉప సర్పంచ్, బేగంపేట గ్రామ ఉపసర్పంచ్ సందెల రేణుక కుమారస్వామి, రత్నాపూర్ వార్డ్ సభ్యులు బత్తుల రాజమణి రమేష్, పన్నూరు చేతి సుధాకర్,కుంట విజయ్ కుమార్ కల్వల రఘుపతి, వైష్ణవి ,మోత్కురి స్వప్నల, మచ్చుపేట వార్డు సభ్యులు దుండే జ్యోతి రాణి రాజేందర్ లను సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు ఉయ్యాల కుమారస్వామి, చారి, ఎన్ శ్రీనివాస్ రావు, గడం తిరుపతి యాదవ్, ఎలాంకి రామారావు, సత్రం సమ్మయ్య, మేకల మారుతి యాదవ్, ప్రేమ్ కుమార్,టి ప్రవీణ్ రెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు..