News & Views

చర్చ, సెంటర్. షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం

కులాంతర వివాహానికి సహకరించారని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు

చర్చ, రంగారెడ్డి జిల్లా

సెంటర్. షాద్ నగర్
జిల్లా.రంగారెడ్డి

ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

కులాంతర వివాహానికి సహకరించారని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌ తమ్ముడు చంద్రశేఖర్‌ అదే గ్రామానికి చెందిన భవాని అనే యువతిని ప్రేమించాడు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరని భావించి 10 రోజుల కిందట వారు ఊరు నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇందుకు సహకరించింది పెళ్లికుమారుడి అన్న రాజశేఖర్‌ అని భావించి యువతి బంధువులు కక్ష పెంచుకున్నారు.
ఈ నెల 12న మాట్లాడుకుందామని, సంధి కుదుర్చుకుందామని నలుగురు వ్యక్తులు రాజశేఖర్‌ను నమ్మించి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఆక్కడ ఆయన్ను తీవ్రంగా కొట్టి చంపారు. తర్వాత మృతదేహాన్ని కారులో మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మనగండ్ల గేటు వద్దకు తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు షాద్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రితో పాటు అనుమానం ఉన్న పలువురి పేర్లను పోలీసులకు ఇచ్చారు.షాద్‌నగర్‌ పోలీసులు విచారణ చేపడుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.