News & Views

చర్చ,గోదావరిఖని: రజక జర్నలిస్టులకు ఆత్మీయ సన్మానం

రజక జర్నలిస్టులకు ఆత్మీయ సన్మానం

గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ సంయుక్త కార్యదర్శులుగా రజక జాతికి చెందిన మామిడి అశోక్‌,పైడాకుల బిక్షపతిలు ఇటీవల ఎన్నికైన నేపథ్యంలో రజక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సోమవారం తిలక్‌నగర్‌లోని విశ్వం ఫంక్షన్ హాల్‌లో గోదావరిఖని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక జాతికి చెందిన జర్నలిస్టులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజాభివృద్ధికి ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రజక జాతికి చెందిన పాత్రికేయులు పదవులు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
తదనంతరం నూతనంగా ఎన్నికైన పైడాకుల బిక్షపతి, మామిడి అశోక్‌లకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రెస్‌క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, సమాజం, ప్రజల కోసం మరింత నిబద్ధతో పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవిందర్, వడ్లూరి దేవయ్య, ములుకుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, పైడి రాజయ్య ,ముక్కెర శ్రీనివాస్, తిరుపతి ,ఎలబోతారం సదానందం, బిజ్జిగిరి వెంకటరాజం, మామిడి మహేందర్, తోటపల్లి శ్రీనివాస్,పసునూటి రాజేందర్,నగునూరి రాజేశం, పైతరి సురేష్, కొల్లూరి గోపాల్, నడిగొట్టు పోశం,సూరి శంకర్,కంచర్ల సారయ్య, పోలంపల్లి సారయ్య,గుండ్రాతి నారాయణ,కాసర్ల సురేష్,పైండ్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు