చర్చ,రామగుండం… అంజనాద్రి గుట్టపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం….పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ దంపతులు..
అంజనాద్రి గుట్టపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం....

చర్చ,రామగుండం…
అంజనాద్రి గుట్టపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం….
పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ దంపతులు..
రామగుండం బి పవర్ హౌస్ సమీపంలో అంజనాద్రి గుట్టపై దనుర్భాన రామాంజనేయ ట్రస్ట్ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. బారీ సంఖ్యలో భక్తులు హాజరై వ్రతంలో పాల్గొన్నారు.సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం పట్టణ పూర్వవైభవంతో పాటు ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణ ముఖ ద్వారం అంజనాద్రి గుట్టపై 108 అడుగుల భారీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ఆయన చెప్పారు. రాముడు నడయాడిన భూమిగా రామగుండం చరిత్ర చెబుతుందని… దానికి నిదర్శనమే ధనుర్బాన సమేత ఆంజనేయ స్వామి ఆర్విర్భవించడం జరిగిందన్నారు. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం తోపాటు మతాలకు అతీతంగా ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామన్నారు. ప్రజల ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉరకలు పెట్టిస్తామన్నారు. ధనుర్బాన సమేత ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ ప్రాంతంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్తీక మాసం వన భోజనాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు ఉత్సాహంగా పాల్పంచుకున్నారు.