చర్చ, సత్తుపల్లి: ఘర్షణలో వ్యక్తి మృతి…..

ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం చౌడారం వద్ద రాజుగూడెం గ్రామంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మార్కపూడి వెంకట్రావు (50), బొల్లిపోగు వెంకటేశ్వరరావు ల మధ్య ఇంటి ముందు కట్టేసిన గేదెల విషయమై ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.
ఈ క్రమంలో వాగ్వాదం తీవ్రస్థాయికి చేరగా, బొల్లిపోగు వెంకటేశ్వరరావు కర్రతో మార్కపూడి వెంకట్రావు పై దాడి చెయ్యగా..వెంకట్రావు గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుడు కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించారు.
దాడిలో బయటకు కనపడని దెబ్బలకు చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందాడు.
అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకట్రావు మృతి చెందినప్పటికీ పోలీసులకు ఎలాంటి పిర్యాదు అందలేదని, ప్రాధమిక దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తి లింగం తెలిపారు.