చర్చ : అశ్వారావుపేట, ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి మరొకరికి గాయాలు…

ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి మరొకరికి గాయాలు.
చర్చ:- అశ్వారావుమమ
అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం గ్రామ పరిసర ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకుడు గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే ఆసువారిగూడెం గ్రామానికి చెందిన మడివి వరుణ్ (20), జంపాలయ్య అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, గుమ్మడవల్లి గ్రామం నుండి వస్తున్న ఇసుక ట్రాక్టర్ బచ్చువారిగూడెం పరిసర ప్రాంతంలోని రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మడివి వరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా, జంపాలయ్యకు గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.