చర్చ,గోదావరిఖని: ఖనిలో దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై హైకొర్టులో పిటిషన్ …
ఖనిలో దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై హైకొర్టులో పిటిషన్ ...

చర్చ,గోదావరిఖని:
ఖనిలో దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై హైకొర్టులో పిటిషన్ …
కూల్చి వేసిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ను ఆశ్రయించిన సామాజిక కార్యకర్త మద్దెల దినేష్…
ఈనెల 5వ తేదీన గోదావరిఖనిలో ని పలు డివిజన్లలో రోడ్లకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో రామగుండం మున్సిపల్ అదికారులు 46 దారి మైసమ్మ,గ్రామ దేవతల ఆలయాలను కూల్చి వేశారు.ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దారి మైసమ్మ గుడులను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ రామగుండం నగర పాలక సంస్థ అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గౌరవ హైకోర్ట్ లో పిటిషన్ WP. NO 35220 /2025 దాఖలు చేసినట్లు సామాజిక కార్యకర్త ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఓ ప్రకటన లో తెలిపారు.
నేడు హైకోర్టు లో కూల్చివేతలపై విచారణ జరుగగా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా మౌనం వహించారని పేర్కొన్నారు.
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఇంచార్జికమిషనర్ అరుణ శ్రీ మరియు టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ పేర్లను పిటిషన్ నుండి తొలగించాలని కొరగా హై కోర్ట్ నిరాకరించినట్లు తెలిపారు.
కూల్చివేతలపై రెండు వారాలు గడువు ఇస్తూ ఎందుకు కూల్చారో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. కూల్చివేతలపై పోలీస్ శాఖ విచారణ చేసి డీటెయిల్డ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ,జిల్లా కలెక్టర్ ప్రత్యేక కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు.
పిటిషనర్ తరుపున సీనియర్ కౌన్సిల్ ఏ. రవీందర్ రెడ్డి, అడ్వకేట్ సావన్ చక్రవర్తి పాల్గొన్నట్లు మద్దెల దినేష్ పేర్కొన్నారు..