చర్చ,ఏటూరు నాగారం: ఏటూరునాగారంలో ఆధార్ సెంటర్ దోపిడీ
- ప్రశ్నిస్తే పాత్రికేయుడినే బెదిరిస్తున్న వైనం
- గిరిజనుల అమాయకత్వమే పెట్టుబడిగా అక్రమ వసూళ్లు
- నిబంధనలు గాలికి.. వసూళ్లే ధ్యేయం
- అధికారుల పర్యవేక్షణ లోపంతో నిర్వాహకుల ఇష్టారాజ్యం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ల నిర్వాహకులు సామాన్య ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము మాత్రమే తీసుకోవాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
అసలు ఏం జరుగుతోంది?
ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ లేదా వేలిముద్రల మార్పుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కేవలం 75 రూపాయలు మాత్రమే. కానీ, ఏటూరునాగారంలోని ఆధార్ సెంటర్ల నిర్వాహకులు వద్ద నుంచి ఏకంగా 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
గిరిజనుల అమాయకత్వమే ఆసరా
ఏజెన్సీ పరిధిలోని మారుమూల గ్రామాలనుండి వచ్చే గిరిజనులకు ప్రభుత్వ ధరల పట్ల అవగాహన లేకపోవడాన్ని నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
రసీదుల మాయాజాలం: ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నప్పటికీ, కస్టమర్లకు ఇచ్చే రసీదులో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరనే ముద్రిస్తున్నారు.
ప్రశ్నిస్తే నిర్లక్ష్యం
ఎవరైనా రేట్ల గురించి ప్రశ్నిస్తే, సర్వర్ ప్రాబ్లం ఉందని లేదా పని కాదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఆధార్ సెంటర్ లో 75 రు ఆన్లైన్లో చార్జెస్ అవుతే ఆధార్ అప్డేట్ ఒక కార్డుకి 150 నుండి 200 చొప్పున వసూలు చేస్తున్నారు. చర్చ న్యూస్ రిపోర్టర్ పాషా వివరణ అడిగితే ఆధార్ సెంటర్ యజమానురాలు పేయ్యల అనూష ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ ఏ అధికారి మమ్మల్ని ఏం చేయలేరంటూ మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నాలుగు లక్షల 50 వేల రూపాయలు కట్టి ఆధర్ సెంటర్ తెచ్చుకున్నాము కరెంటు బిల్లు రిజెక్ట్ అయితే 50,000 వేల రూపాయలు ఫైన్ పడతాయి కాబట్టి మేము కచ్చితంగా 150 రూపాయలు తీసుకుంటాము అని చెప్పి ఎవరికి చెప్తావో చెప్పుకో పో అని నీ ఇష్టం అని అంటుంది
తనని వివరణ అడగగా మీసేవ యజమాని అయిన భర్త శ్రీకాంత్ కి కాల్ చేసి స్థానిక రిపోర్టర్లు వివరణ అడుగుతున్నాడని అని చెప్పినప్పటికీ ఏమాత్రం జంకు లేకుండా సదరు విలేకరిపై మీరు చిల్లర వివరణ అడుగుతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన విలేకరిని చిల్లరగా మాట్లాడుతావని కించపరుస్తున్నారు
సాధారణ సాధారణ ప్రజలు పరిస్థితి ఏంటి?
”75 రూపాయలు తీసుకోవాల్సిన చోట 200 రూపాయలు అడుగుతున్నారు. మేము కష్టపడి సంపాదించే కూలీ డబ్బులు ఇలా ఆధార్ పేరుతో దోచుకోవడం అన్యాయం.” ఒక బాధితుడి ఆవేదన.
అధికారులు స్పందించాలి
కళ్లముందే అక్రమాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఏటూరునాగారంలోని ఆధార్ సెంటర్లపై దాడులు నిర్వహించాలని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నిర్వాహకుల లైసెన్సులను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.