చర్చ, సత్తుపల్లి: ప్రమాదాలకు నిలయంగా పాత బస్టాండ్ రింగ్ సెంటర్..
ప్రమాదాలకు నిలయంగా పాత బస్టాండ్ రింగ్ సెంటర్..
చర్చ, సత్తుపల్లి:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం పాత సెంటర్ రింగ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ ద్విచక్ర వాహనం పై నుండి పక్కకు పడి సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు యువకులు
ప్రధాన రహదారిలో పాత సెంటర్ రింగ్ రోడ్ వద్ద కుడివైపున గల కాకర్లపల్లి రోడ్డు వైపుకి టర్న్ తీసుకునేందుకు యువకులు సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకనే అశ్వరావుపేట నుండి ఖమ్మం వైపు వెళుతున్న ఓ లారీ ముందు భాగం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో పైనున్న ఇద్దరు యువకులు పక్కకు పడిపోయారు లారీ డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ సినా లారీ రెండు మీటర్లు బైక్ ని ముందుకు నెట్టుకు వెళ్ళింది. బైక్ ఒకవైపు కొంతమేర డ్యామేజ్ అయినా కింద పడ్డ ఇద్దరు యువకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అక్కడ ఉన్న స్థానికులు ఏ విధమైన ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.