చర్చ, పాల్వంచ: ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వైద్య పరీక్షలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
చర్చ, పాల్వంచ
ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వైద్య పరీక్షలు
పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అనారోగ్య సమస్యతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి స్వయంగా ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం అయన ఆసుపత్రిని సందర్శించి వైద్యులు మరియు సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు