News & Views

వ్యవసాయ కార్మికులకు రోజు కూలి600 రూపాయలు ఇవ్వాలి – ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం మరిచారా? తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యుయూ)

వ్యవసాయ కార్మికులకు రోజు కూలి600 రూపాయలు ఇవ్వాలి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం మరిచారా?

వ్యవసాయ కార్మికులకు రోజు కూలి600 రూపాయలు ఇవ్వాలి

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం మరిచారా?
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యుయూ)

చర్చ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం

వ్యవసాయ కార్మికులకు రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు విజయ కాలనీ గ్రామంలో వ్యవసాయ కూలీల జనరల్ బాడీ సమావేశం ఉడుగుల షారోని అధ్యక్షతన జరిగింది, ఈ సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12000 రూపాయలు ఇస్తామని ప్రకటించి అమలు చేయడాన్ని విస్మరించిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులను పేదరికం నుంచి బయటకు తీసుకు రావడంలో వైఫల్యం చెందాయన్నారు. వ్యవసాయ కార్మికులకు అందరికీ ఇండ్లు మంజూరు చేయకుండా భూమి పంచకుండా పేదరికం ఎలా పోతుందని అన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలపై, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభలో
నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బందెల చంటి, అధ్యక్షురాలు షారోని, సిపిఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు, ఐద్వా మండల కార్యదర్శి పొడుపుగంటి సమ్మక్క, వరలక్ష్మి, ఆదెమ్మ, తదితరులు పాల్గొన్నారు.