చర్చ.భద్రాచలం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్స్య విగ్రహానికి మోక్షం ఎన్నడు -అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్
జిల్లా కలెక్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా కదలని పరిస్థితి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చర్చ…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్స్య విగ్రహానికి మోక్షం ఎన్నడు
జిల్లా కలెక్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా కదలని పరిస్థితి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్స్య విగ్రహాన్ని మరచిన నేతలు
కాంస్య విగ్రహానికి అధికారులు పార్టీ నేతలు కదలాలి
అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటులో జాప్యం జరుగుతుందని మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్ రాజ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ భద్రాచలం నడిబొడ్డున ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం రోజురోజుకి క్షీణించి పోతుందని దానిని దృష్టిలో పెట్టుకొని గతంలో రాజకీయ నేతలు కాంస్య విగ్రహం తీసుకొచ్చారని దానికి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఏర్పాటుకి సమ్మతం తెలిపారని బిపిఎల్ కాంట్రాక్టర్కు అప్పచెప్పారని ఆయన పేర్కొన్నారు అయినా ఇప్పటిదాకా తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుందని అది సరైనది కాదని ఆయన ఆవేదన చెందారు దీనిపైన ఎక్స్ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కలగజేసుకుని అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు భద్రాచలం పట్టణంలో ఎస్సీలకు ఏదైనా పని కావాలంటే దాని మీద శ్రద్ధ లేదని కానీ దళితుల ఓట్లు కావాలంటే ఎమ్మెల్యే ఎంపీలకు దళితులపై ప్రేమ చూపించి ఓట్లు వేయించుకుంటున్నారని అలాగే దళితులకి దేవుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎవరు సహకరించట్లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఎక్స్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఎంపీ బలరాం నాయక్ అలాగే అధికారులు స్పందించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు పెట్టని పక్షంలో దశల వారి పోరాటం చేయడానికి సిద్ధపడతామని ఆయన తెలిపారు