చర్చ, ములుగు: అంబటి వినయ్, దంపతులు బి ఆర్ ఎస్ లో చేరిక
అంబటి వినయ్, దంపతులు బి ఆర్ ఎస్ లో చేరిక
బి ఆర్ ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో బి జె పి పార్టీ నుండి వరంగల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు కాసు శిల్ప బిజెపి సీనియర్ నాయకులు అంబటి వినయ్ దంపతులు (వినాయక రిసార్ట్) బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
గత ప్రభుత్వం లో చేసిన అభివృద్ధిని చూసి ,రాబోవు రోజులలో బిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇక పై బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని, మండల అభివృద్ధి లో జిల్లా అభివ్రుద్ది లో పాలు పంచుకుని ప్రజా సేవలో ముందుంటామని కాసు శిల్ప అంబటి వినయ్ దంపతులు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లకావత్ నరసింహ నాయక్ మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి స్వరూప చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణ చందర్ బురెడ్డి మధుసూదన్ రెడ్డి సీనియర్ నాయకులు రేండ్ల శ్రీనివాస్ రేండ్ల సంతోష్ బొల్లం ప్రసాద్ బైకని ఓదెలు సామరాంరెడ్డి దర్శనాల సంజీవ ,కొంపెల్లి కృష్ణారెడ్డి, బొడిగ రఘువీర్, పల్లపు కుమార్ ,మీస రవి, కుమ్మరి వెంకన్న ,మరియు గోవిందరావుపేట మండల కార్యకర్తలు పాల్గొన్నారు.