News & Views

చర్చ, జగిత్యాల: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ – ఎమ్మెల్యే సంజయ్ కుమార్
చర్చ, జగిత్యాల: బడుగు బలహీన వర్గాలకు స్వేచ్చ స్వాతంత్రాన్ని అందించిన అంబేద్కర్ డు పేద ప్రజల ఆశా జ్యోతి అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా జగిత్యాల తహసిల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు.
అంబేద్కరిస్టులకు అంబేద్కర్ భవన్ అందుబాటులోకి తీసుకువస్తానని
ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ స్పందన, అంబేద్కర్ సంఘ నాయకులు, సభ్యులు, పట్టణ నాయకులు తదితరులున్నారు.