News & Views

చర్చ, కొత్తగూడెం: గెలుపుని తలపించిన పంచాయితీ ఎన్నికల ప్రచారం

గెలుపుని తలపించిన ఎన్నికల ప్రచారం

నంద తండాలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మంగీలాల్ భారీ ర్యాలీ

చర్చ, చుంచుపల్లి

చుంచుపల్లి మండలం నంద తండ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ రంగం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అజ్మీరా మంగీలాల్ భారీ ర్యాలీతో ప్రచారానికి నాంది పలికారు. గ్రామంలోని ముఖ్య వీధులంతా జనసంద్రంగా మారాయి. మహిళలు, యువత, పెద్దలు అందరూ కలిసి మంగీలాల్ కు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ చివర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అజ్మీరా మంగీలాల్, ఒక్కసారి గెలిపించండి అభివృద్ధి ఎలా ఉండాలో నేను చూపిస్తా. మీ నమ్మకాన్ని నా పనితో నిలబెట్టుకుంటా” అని తెలియచేశారు.
గ్రామ అభివృద్ధి, తాగునీటి సమస్యలు, రోడ్ల మరమ్మత్తులు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు, కోతుల బెడద, వీధి కుక్కల బెడద వంటి సమస్యలు త్వరితకాలంలోనే పరిష్కరిస్తా. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులతో సంప్రదింపులు వంటి అనేక అంశాలపై వివరమైన ప్రణాళికను ప్రజలకు తెలియజేశారు. రాబోయే సంవత్సరాల్లో నంద తండా పూర్తి మార్పు దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. నంద తండా పంచాయతీ ఎన్నికల్లో మంగీలాల్ ర్యాలీతో కాంగ్రెస్ కు కొత్త ఊపు చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అజ్మీర మంగీలాల్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతోటి పాల్ పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.