News & Views

 చర్చ, కమాన్ పూర్: కమాన్ పూర్ శివాలయంలో లోకకళ్యాణం కోసం అనగాష్ట వ్రతం

మండల కేంద్రంలోని (చంద్రమౌలేశ్వర స్వామి) శివాలయంలో “అనగా అష్టమి వ్రతము” కరీంనగర్ వాస్తవ్యులు ఎనగందుల వేణుగోపాల శర్మ , శిష్యుడు అలిపిరెడ్డి రాజు లు పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా వేణుగోపాల శర్మ మాట్లాడుతూ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివ స్వరూపమని, మరి దత్తాత్రేయుడు జ్ఞాన స్వరూపము కావున దత్తాత్రేయుని లోక కళ్యాణం కోసం శివాలయంలో అనగాష్ట వ్రతం చేయడం జరిగిందన్నారు. సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రతి ఒక్కరు ఇంట్లో భగవద్గీత పారాయణం గురించి చిన్నతనం నుంచే పిల్లలకు తెలియపరచాలని వేణుగోపాల శర్మ సూచించారు. ఈ వ్రత పూజ మహోత్సవానికి, మహిళలతోపాటు అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కోలేటి నాగభూషణం కుటుంబ సభ్యులు, వేణు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు తాటి పెళ్లి శ్రీనివాస్, సలహాదారులు తోట శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి కోలేటి సురేష్, మాడూరి చందు, మాజీ ఎంపీపీ ఇనగంటి హేమలత, మాజీ ఎంపిటిసి కోలేటి శేఖర్, గులగం సతీష్, కోలేటి బాపన్న, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బొజ్జ నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.