News & Views

చర్చ, జగిత్యాల: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు

ఎమ్మెల్సీ ఎల్. రమణ

చర్చ, జగిత్యాల ప్రతినిధి :
“జయ జయహే తెలంగాణ” రాష్ట్ర గీతం రచయిత, కవిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డా.అందెశ్రీ అకాల మరణం బాధాకరమని, తెలంగాణ కు తీరని లోటని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. సోమవారం వారి మృతి పట్ల సంతాపం ప్రకటించి, శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మేల్సీ రమణ భగవంతుడిని ప్రార్థించారు