News & Views

చర్చ, కరీంనగర్: జనమంచి గౌరీ శంకర్(గౌరిజీ) యువ పురస్కారం-2026కోసం దరఖాస్తుల ఆహ్వానం

  •  అజయ్ ABVP కరీంనగర్ విభాగ్ కన్వీనర్

ఏబీవీపీ తెలంగాణ 44వ రాష్ట్ర మహాసభలు శంషాబాద్ లో జనవరి 3,4,5 తేదీలలో నిర్వహిస్తున్నామని ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ తెలిపారు. ఏబీవీపీ ప్రతి సంవత్సరం రాష్ట్ర మహాసభలలో అనేక రకాల సమస్యలపైన చర్చించి, మహాసభలో తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో సేవ కార్యక్రమాలు చేసే వారిని ప్రోత్సహిస్తూ ప్రతీ సంవత్సరం రాష్ట్ర మహాసభలలో ఉమ్మడి రాష్ట్రంలో ఎబివిపి పని విస్తృతికి విశేష కృషి చేసి, సమాజ సేవకే తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరు మీద ప్రతి సంవత్సరం రాష్ట్ర మహాసభలలో సమాజంలో సేవ కార్యక్రమాలు చేసే వారిని ప్రోత్సహిస్తూ అందజేసే “శ్రీ జనమంచి గౌరీ శంక యువపురస్కార్” పేరుతో సత్కరించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ యొక్క దరఖాస్తు చేసుకోవాలిసిన వారు సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ఇతర ప్రముఖ రంగాలలో విశేష కృషి కనబరుస్తూ, యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆదర్శ యువత్ యువకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అవార్డు కింద 50,000/- (ఏభై వేల రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేయబడుతుందని అన్నారు. దరఖాస్తుదారులు తమ పూర్తి బయోడేటా, చేస్తున్న కార్యక్రమాల వివరాలు పంపించాలని అన్నారు. దరఖాస్తు చేసుకునే వారు వివరాల కోసం v. రామకృష్ణ 9666149044, k.అజయ్ 9959389483 ని సంప్రదించగలరు.