News & Views

చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే జారే…

అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా జరువుకున్నారు...

చర్చ : అశ్వారావుపేట , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే జారే…

అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా జరువుకున్నారు. అలాగే ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ కోటి కాంతులు నింపాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో సంతోషభరితంగా, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. సురక్షితమైన పద్ధతుల్లో పండుగను జరుపుకోవడంతోపాటు ప్రమాదాలను జరగకుండా, దీపావళి జరుపుకోవాలని అన్నారు.