చర్చ:కమాన్‌పూర్: శ్రీ ఆదివారాహ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ ఆదివారాహ స్వామి దేవాలయాన్ని గురువారం దేవాదాయ–ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ ఆదివారాహ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆలయ సిబ్బందితో చర్చించారు. ఆలయ పరిరక్షణ, సంప్రదాయాల కొనసాగింపుపై అవసరమైన సూచనలు ఇచ్చినట్లు సమాచారం.