చర్చ, అశ్వారావుపేట: ఎట్టకేలకు బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభం.
ఎట్టకేలకు బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభం.

గత రెండు సంవత్సరాలుగా జాతీయ రహదారి విస్తరణ పనులు వల్ల రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు కాని నివాసితులు కాని వాహనాదారులు, వాహనాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యాపార వర్గాల వారు పడిన ఇబ్బందులకు ఎట్టకేలకు నేటికీ మోక్షం లభించింది.
కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈరోజు రహదారిపై బీటీ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.
బీటీ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్రరావు, తుమ్మా రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, ప్రమోద్ తదితరులు దగ్గర ఉండి నాన్యత ప్రమాణాలను పర్యవేక్షించారు.