
ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
చర్చ, ములకలపల్లి; మండలంలోని జగన్నాధపురంలో అయ్యప్ప స్వాములు పడిపూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కన్నె స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి కలిశ పూజలు వైభవంగా జరిపారు. భక్తి గీతాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వాములు నాట్యం ఆడుతూ భక్తులను పరవశింప జేశారు. పడిపూజ అనేది అయ్యప్ప స్వామికి చేసే ఒక ప్రత్యేకమైన పూజ. ఈ పూజ ద్వారా కష్టాలను తొలగించి, జీవితంలో సంతోషం, ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి భక్తులు అయ్యప్ప దేవుడిని ఆశీర్వాదం కోరుకుంటారు. పడిపూజ కలిశపూజ నూజివీడు లక్ష్మణరావు గురుస్వామి ఏర్పాటు చెయ్యగా, భక్తులకు అనుముల సత్యనారాయణ భిక్ష, అల్పాహారం ఏర్పాటు చేశారు.