News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: ఐఎంఏ జిల్లా కార్యదర్శిగా బి.ఎస్.రావు

ఐఎంఏ జిల్లా కార్యదర్శిగా బి.ఎస్.రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కార్యదర్శిగా బి.ఎస్.రావు ఎన్నికయ్యారు. వైద్య రంగంలో ఆయన చూపుతున్న అంకితభావం, సమర్థ నాయకత్వం, వైద్య వృత్తిలో అందిస్తున్న సేవలకు గాను ఆయనకు ఈ పదవి వరించింది. ఈ బాధ్యతాయుతమైన పదవిలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, వైద్య సమాజానికి మరింత సేవ అందించాలని జిల్లాలోని పలువురు వైద్యులు, సామాజిక వేత్తలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.