News & Views

చర్చ, నందతండా: నంద(తండా) గ్రామాన్ని పాలించనున్న బలరాముడు

    • అసెంబ్లీ ఎన్నికలను తలపించిన పంచాయతీ ఎన్నికలు
    • 60 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ అభ్యర్థి బలరాం విజయం

 

చుంచుపల్లి మండలం నందా తండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠతో గ్రామస్తులు పోలింగ్ బూత్ వద్దనే బారులు తీరారు. సిపిఐ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాలోత్ మురళి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అజ్మీర మంగ్య గట్టి పోటీ ఇవ్వగా మాలోత్ బలరాం విజయం సాధించారు.

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా, మీరే సర్పంచ్ గా కావాలి అని నా ఇంటి గడప తొక్కేలా చేస్తా అన్న నినాదంతో ప్రచారాన్ని మొదలుపెట్టిన మాలోత్ బలరాం, పంచాయతీలో పది వార్డులకు గాను మూడు సిపిఐ గెలుచుకోగా, ఏడు వార్డులను బిఆర్ఎస్ గెలుచుకొని విజయ డంకా మోగించారు. వార్డ్ మెంబర్ల కృషి, బలరాం ని అభిమానించే స్నేహితులు, గ్రామ యువత, కుటుంబ సభ్యుల సహకారంతో 60 ఓట్ల మెజారిటీ తో నంద తండ గ్రామ సర్పంచ్ గా గెలుపొందారు. జై బలరాం, జై బిఆర్ఎస్, జై వనమా అంటూ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.