చర్చ, సత్తుపల్లి: బత్తులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం
బత్తులపల్లి పంచాయతీ ఏకగ్రీవం
- సర్పంచ్ గా గుగులోత్ ఉమారాణి
సర్పంచ్ గా కాంగ్రెస్ బలపర్చిన గుగులోత్ ఉమా రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పాటు పది వార్డుల సభ్యులు సభ్యులు ఏకగ్రీవమ య్యాయి. బత్తుపల్లి పంచాయతీలో రెండు సర్పంచ్ నామినేషన్లు, 20 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు కాగా, సర్పంచ్ తో పాటు పదిమంది వార్డు మెంబర్లు తమ నామినేషన్లు మంగళవారం ఉపసం హరించుకున్నారని తెలిపారు. కల్లూరు మండలంలో 23 పం చాయతీలలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం కాగా 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగను న్నాయి. నామినేన్ల చివరి రోజున మండలంలోని నారాయణపురం పంచాయతీకి ఒక సర్పంచ్, 10 వార్డు మెంబర్లకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావటంతో ఆ పంచాయతీ పాలకవర్గమైన సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇలా జరగడం ఇదిరెండో సారి. ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడిన సర్పంచ్ ను రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి , సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి , కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ వారిని అభినందించారు.