News & Views

చర్చ, జగిత్యాల : దేవుళ్లపై సినిమాలు తీస్తూ దేవుళ్ళను విమర్శించడమా – దర్శకుడు రాజమౌళి తీరుపై మండిపడ్డ భారత్ సురక్ష సమితి

దేవుళ్లపై సినిమాలు తీస్తూ దేవుళ్ళను విమర్శించడమా

దర్శకుడు రాజమౌళి తీరుపై మండిపడ్డ భారత్ సురక్ష సమితి

చర్చ, జగిత్యాల : హిందూ దేవుళ్ళ పై సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి హిందూ దేవుళ్ళ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ హిందువులను భాధించాయని భారత సురక్ష సమితి నాయకులు మండిపడ్డారు. శుక్రవారం విద్యానగర్ లోని తమ కార్యాలయ వేదికగా సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ మాట్లాడారు. రాజమౌళి ఒక ప్రముఖ దర్శకుడని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి అని అన్నారు. ఇలాంటి వ్యక్తి సమాజానికి ఉపయోగపడేలా చర్యలు ఉండాలని ఆలా కాకుండా హిందుత్వం మీద, హిందూ దేవతల పైన చులకన భావంతో మాట్లాడడం సరికాదన్నారు. గతంలోనూ శ్రీరాముడిపై, కృష్ణుడిపై అనవసరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. కొత్తగా వారణాసి సినిమా సందర్బంగా దేవునిపై తనకు నమ్మకం లేదని ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యనాలు చేశారన్నారు. ఇదే హిందూ దేవుళ్ళ పై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తూ హిందూ దేవుళ్ళ ను విమర్శించడం ఫ్యాషన్ గా మార్చుకొన్నారన్నారు. ఇలాంటి వారిని వదిలిపెడితే మరికొందరు హిందూ దేవుళ్ళ ను విమర్శించడమే పనిగా పెట్టుకొంటారని వారణాసి సినిమా ను హిందువులందరు బహిష్కరించి రాజమౌళి కి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షలు ఏ సి ఎస్ రాజు, ప్రధాన కార్యదర్శి కాశినాథం,
బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ లక్ష్మి, సురక్ష సమితి కార్యదర్శి సింగం గంగాధర్, ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు, వేముల దేవరాజం, కె ఆర్ కృష్ణ, బొందుకూరి శ్రీనివాస్, కొత్తకొండ బాలన్న, నరేందుల శ్రీనివాస్, రాయికల్ రామ్ చంద్రం, సిరిపురం గంగారం, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, బాసెట్టి దుబ్బ రాజం తదితరులున్నారు.