చర్చ, ఇల్లందు: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవం..
పాల్వంచలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
- ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. – ప్రత్యేకత..
ఆయన ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా సాధారణ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిగా ఆయన గురించి ఈ బయోపిక్ నిర్మిస్తున్నారు.ఆయన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గుమ్మడి నర్సయ్య పాత్రలో నటిస్తున్నారు.
నిర్మాణ సంస్థ ప్రవళిక ఆర్ట్స్,
దర్శకుడు పరమేశ్వర్,
నిర్మాత నల్లా సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై, ముహూర్త షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, గుమ్మడి నర్సయ్యను *”ప్రజల మనిషి”, “పేదవారి దేవుడు”*గా కొనియాడారు. ఆయన గత రెండు సంవత్సరాలలో సినిమా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రారంభోత్సవానికి మొదటిసారిగా వచ్చానని, ఇది తనకు దొరికిన మంచి అవకాశమని తెలిపారు.
గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఎప్పుడూ ఒక గుర్తుపై పోటీ చేయలేదని, ఒక పేద కుటుంబంలో పుట్టి, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు,ఆయన నిరాడంబరతను వివరిస్తూ, ఎమ్మెల్యే జీతం కూడా పేదవారికి సహాయం చేస్తారని, అలాగే ఆయన ఆస్తులను కూడా దానం చేశారని, సైకిల్‌నే ఆయన వాహనంగా ఉపయోగించేవారని పేర్కొన్నారు.ప్రతి ఎమ్మెల్యే, సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ నర్సయ్య గారి జీవిత చరిత్రను చూడాలని కోరారు.
ఆయన లాంటి నిస్వార్థ ప్రజాప్రతినిధి గురించి సినిమా రావడం వలన, ప్రజా ప్రతినిధులలో అవినీతి తగ్గుతుందని, మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సినిమాకు సబ్సిడీ విషయంలో ముఖ్యమంత్రిగారితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మల్లు నందిని, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు భారీగా తరలివచ్చిన జన సందోహం పాల్గొన్నారు.