చర్చ ,పెద్దపల్లి: ఢిల్లీ పేలుళ్లకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన…

చర్చ ,పెద్దపల్లి ప్రతినిధి:
ఢిల్లీ పేలుళ్లకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన….
డిల్లీలో పేలుళ్ల కు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద బిజెపి శ్రేణులు, రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి,పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు..
భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన చూసి జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఢిల్లీ పేలుళ్లకు బాధ్యులైన ఉగ్రవాదులకు త్వరలో తగిన గుణపాఠం చెప్తామని నాయకులు హెచ్చరించారు