చర్చ, కరీంనగర్: మన్ కి బాత్ వీక్షించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
జమ్మికుంట పట్టణంలోని ఆకుల తిరుపతి ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వీక్షించారు. 2025 సంవత్సరానికి సంబంధించి చివరి మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ అనేక విషయాలను ఉద్దేశించి మాట్లాడారని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ప్రధానంగా ఈ ఏడాదిలో భారతదేశం జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ వంటి అంశాల్లో ప్రపంచంలోని అతిపెద్ద వేదికల్లో దేశం బలమైన ముద్ర వేసిందని, ఆపరేషన్ సింధూర్ భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచిందనే విషయాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారన్నారు. వికసిత్ భారత్ ద్వారా అన్ని రంగాలలో దేశం దూసుకుపోతుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ప్రపంచంలోని అనేక దేశాలలో యుద్దాలతో , పక్క దేశాలలో అశాంతి పరిస్థితులు ఉంటే, ప్రధాని మోదీ సారథ్యంలో భారతదేశం మాత్రం స్థిరమైన , విజయవంతమైన పాలన కొనసాగించిందన్నారు. ఈకార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు, కమలాపూర్ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి వెంకటరమణ రెడ్డి, హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు తదితరులు పాల్గొన్నారు.