చర్చ , బీహార్ బులెటిన్ న్యూస్: బిహార్ ఎన్నికలు..బీహార్‌లో NDA ఘన విజయం..
బీహార్ - బీజేపీ విజయోత్సవ సభ

చర్చ , బీహార్ బులెటిన్ న్యూస్ :బిహార్ ఎన్నికలు..బీహార్‌లో NDA ఘన విజయం.. బీజేపీ విజయోత్సవ సభ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల కోసం నవంబర్ 14 ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తాజా రౌండ్ రిజల్టుల ప్రకారం ఎన్డీయే విజయం దిశగా దూసుకెళ్తోంది. మెజార్టీ మార్కును మాత్రమే కాకుండా, భారీ ఆధిక్యాన్ని కూడా సాధిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు ప్రభుత్వ ఏర్పాటుపై అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ రెండు స్థానాల్లో ముందంజలో ఉండటం విశేషం. ఈసారి బీహార్ ప్రజలు 67.13 శాతం రికార్డు స్థాయి పోలింగ్‌లో పాల్గొని, మొత్తం 7.45 కోట్ల ఓటర్లు 2,616 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దారు. ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన అధికారిక ఫలితాలను వరుసగా విడుదల చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయవంతమైతే, నితీశ్ కుమార్ ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే అవకాశాలు బలపడనున్నాయి.